ఆ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!
ఈ ఫొటో కొంచెం వింతగా కనిపిస్తోంది కదూ! ఇది జపాన్లోని ఒక క్యాప్సూల్ హోటల్లోనిది. జపాన్లో ఇలాంటి హోటళ్లు చాలానే ఉంటాయి. ఈ హోటళ్లలో మనుషులు బస చేయడానికి గదులు కాదు, గూళ్లు ఉంటాయి. ఈ గూళ్లలోనే వస్తువులు పెట్టుకోవడానికి తగిన సౌకర్యాలు కూడా ఉంటాయి. రైళ్లలోని బెర్తుల మాదిరిగా ఒకదానిపైన మరొకటి, ఒకదాని పక్కన మరొకటి– ఇలా ఒక్కో హోటల్లోను వందలాది గూళ్లు కనిపిస్తాయి.
చౌక ధరల్లో వసతి సౌకర్యం కోరుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. ఇలాంటి క్యాప్సూల్ హోటళ్లు జపాన్లో నలభై ఏళ్లకు పైగానే నడుస్తున్నాయి. జపాన్లోని తొలి క్యాప్సూల్ హోటల్ 1979లో ప్రారంభమైనప్పుడు కొంత వింతగా చూసేవారు. తర్వాతి కాలంలో ఇలాంటి హోటళ్లు విరివిగా ఏర్పడటంతో జనాలు అలవాటుపడిపోయారు.
(చదవండి: ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..)