జీవీ రామారావుకు టాగో ఘన సన్మానం
ఒర్లాండో:
అమెరికాలోని చిన్నారులపై మొదటిసారిగా 'కెప్టెన్ రిడ్డిల్స్ ట్రెజర్' పుస్తకం రాసిన కెప్టెన్ జీవీ రామారావును సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఒర్లాండో(టాగో) ఘనంగా సన్మానించింది. జీవీ రామారావు భారత నావికాదళంలో పని చేసి రిటైర్ అయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పట్టా పుచ్చుకున్నారు. షిప్ కెప్టెన్‌గా ప్రపంచం మొత్తాన్ని ఆయన చుట్టారు. చిన్న చిన్న కథలతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ది కోలోనియల్స్స్ లాస్ట్ వికెట్, ది గుడ్ బాయ్, ఆల్ అట్ సీ, ది ఇన్‌కంప్లీట్ మ్యాన్, ది ఆడ్ వేస్ ఆఫ్ గాడ్స్, ఎమ్మాస్ ఎస్కపడేస్ ఇంక్రీడబుల్ ఇండియాలాంటి పలు ప్రముఖ పుస్తకాలను ఆయన రాశారు.
టాగో నిర్వహించిన ఈ సమావేశంలో భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తన గాత్రంతో గజల్ శ్రీనివాస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా 2017 ఏడాదికిగానూ నూతన కార్యవర్గ సభ్యులను టాగో ప్రెసిడెంట్ రమేష్ ప్రకటించారు.
నూతన కార్యవర్గ సభ్యులు...
అపర్ణ దూలిపాల (ఎలక్టెడ్ ప్రెసిడెంట్)
శివ కొండపల్లి(సెక్రటరీ)ఔ
సత్య మాంటేనా(ట్రెజరర్)
పద్మ లింగం( కల్చరల్ సెక్రటరీ)
క్రిష్ణ మునుగోటి(నార్త్ ఎగ్జిక్యూటివ్ మెంబర్)
రాజ్‌పాల్ మార్పు(ఈస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ )
జ్యోష్ణ పుడోత(వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్)
నాగ్ మోత్కురి(సౌత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ )
రోహిత్ కాశిరెడ్డి(యూత్ అధ్యక్షుడు)
అంజలి చెరకు(యూత్ అధ్యక్షురాలు)