క్యారమ్ చాంప్ సవితాదేవి
చిలుకలూరిపేట: సౌత్‌జోన్ ఇన్విటేషన్ క్యారమ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి ఎ. సవితాదేవి చాంపియన్‌గా నిలిచింది. ఇక్కడి సీఆర్ క్లబ్లో ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో సవిత 25-0, 25-13తో ఎల్.హరిప్రియా (ఏపీ)పై అలవోక విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఆమె 25-9, 25-0తో హుస్నా సమీర (ఏపీ)పై, హరిప్రియా 25-17, 25-16తో తనూజ (ఏపీ)పై నెగ్గారు.
పురుషుల విభాగంలో హైదరాబాద్ ఆటగాళ్లు సయ్యద్ నయ్యర్, అనిల్ కుమార్, ఆదిత్యలు క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించారు. సయ్యద్ 11-25, 17-25తో భారతీదాసన్ (తమిళనాడు) చేతిలో, అనిల్ 25-20, 1-25, 12-13తో సాగయ్య భారతి (తమిళనాడు) చేతిలో, ఆదిత్య 10-25, 14-22తో రాధాకృష్ణన్ చేతిలో కంగుతిన్నారు. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారతీదాసన్ గెల్చుకున్నాడు.