బంగారం.. అక్కడ దాచినా పట్టేశారు..
న్యూఢిల్లీః హైదరాబాద్ కు చెందిన ఓ కిలాడీ లేడీని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన ఆమె.. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమె... ఇన్నర్ గార్మెట్స్ లో దాచిన.. సుమారు 64,38,960 రూపాయలు ఖరీదు చేసే 2 కేజీల గోల్డ్ బార్లను 160 గ్రాముల బంగారాన్ని ఆమెవద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి వచ్చిన హైదరాబాద్ కు చెందిన మాయ లేడీని ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఎఐయు) అధికారులు.. ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఫర్హాత్ ఉన్నీసాగా గుర్తించారు. దుబాయ్ నుంచి సుమారు 2 కేజీల గోల్డ్ బార్స్ తో పాటు, 160 గ్రాముల బంగారాన్ని అండర్ గార్మెట్స్ లో దాచి, అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఉన్నీసాను.. ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా గుర్తించినట్లు ఎఐయు తెలిపింది. అనంతరం ఆ ప్రయాణీకురాలిని అరెస్టు చేసి, ఆమెవద్దనుంచీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎఐయు తెలిపింది. విదేశాలనుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.