తన కాలును అనకొండకు ఎరగా వేసి
ఏదైనా జంతువును వేటాడానికి సాధారణంగా ఎరగా వేరే జంతువును వాడుకుంటాం(చేపలు పట్టడానికి ఎర్రపామును వాడినట్లు). కానీ భారీ అనకొండను పట్టుకోవడానికి ఓ వ్యక్తి తన కాలును ఎరగా వాడుకున్నాడు. కుడి కాలు మోకాలు వరకూ గుడ్డ చుట్టుకున్న వ్యక్తి ఎలాంటి జంకుబొంకు లేకుండా అనకొండ నివాసంలోకి కాలుని దూర్చాడు.
కొద్దిసేపటికి అనకొండ అతని కాలును మింగడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని తనకు సాయంగా ఉన్న వాళ్లకు అతను చెప్పడంతో వాళ్లు అతన్ని బయటకు లాగడం మొదలుపెట్టారు. దాదాపు 12 అడుగుల పొడవైన అనకొండ అతని కాలును అప్పటికే మింగేసింది. దీంతో మరో వ్యక్తి అనకొండను చీల్చి అతని కాలుని విడిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాదాపు 11మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అయితే ఆకలి బాధతోనే వారు అనకొండను వేటాడారని తెలుస్తోంది.