సీసీఐ ఎండీని కలిసిన టి.టీడీపీ నేతలు
న్యూఢిల్లీ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఎండీ డీఏ మిశ్రాను శుక్రవారం తెలంగాణ టీడీపీ నాయకులు కలిశారు. తమ ప్రాంతంలో పత్తికి మద్దతు ధర చెల్లించడం లేదని మిశ్రా దృష్టికి తీసుకొచ్చారు. పత్తిలో 25 శాతం తేమ ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు.
సిబ్బంది కొరత కారణంగా సీసీఐ ఇప్పటివరకు 65 క్వింటాళ్ల పత్తి కోనుగోలు చేసిందని తెలిపారు. దీంతో పత్తి దళారులు రైతులను మోసం చేస్తున్నారన్న విషయాన్ని సీసీఐ ఎండీ దృష్టికి తీసుకోచ్చారు. వరంగల్, ఆదిలాబాద్, మార్కెట్లలో పర్యటించాలని మిశ్రాకు విజ్ఞప్తి చేశారు.