అఖిల్ చిన్న పిల్లాడన్న సుధీర్
ఈ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సరైన కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాలకు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) కారణంగా హీరో మధ్య స్నేహం మరింత బలపడుతుంది. ఈ రోజు నుంచి సీసీఎల్ సిరీస్ ప్రారంభమవుతున్న సందర్భంగా హీరో సుధీర్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు.
తెలుగు వారియర్స్ టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అఖిల్ ఓ చిన్న పిల్లాడితో మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేసిన హీరో సుధీర్ బాబు.. ‘ఓ పిల్లాడు మరో పిల్లాడికి గేమ్ ప్లాన్, స్ట్రాటజీలో సాయం చేస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సీసీఎల్ మ్యాచ్లలో తెలుగు, హిందీ, బెంగాళీ, పంజాబీ, కన్నడ, భోజ్పూరి ఇండస్ట్రీలకు చెందిన ఆరు టీంలు తలపడనున్నాయి.
One kid is helping the other in game plan and strategy 🤣 #CCL @AkhilAkkineni8 pic.twitter.com/uKb2aVXjXl
— Sudheer Babu (@isudheerbabu) 27 February 2019