‘పర్యావరణ’ సూచీలో భారత్కు 20వ ర్యాంకు
మరాకేస్(మొరాకో): పర్యావరణ మార్పుల పనితీరు సూచీ(సీసీపీఐ)లో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి 20 ర్యాంకుకు చేరింది. 58 దేశాలకు ‘జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెటవర్క్ యూరప్’ విడుదల చేసిన 2016 సూచీ.. వర్ధమాన దేశాలు పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలు పాటించాలని సూచించింది.
‘ఉద్గారాల విషయంలో భారత్ పనితీరు బాగుంది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో స్కోరు మెరుగుపడింది. బొగ్గు నుంచిసాంప్రదాయేతర వనరుల్లోకి పెట్టుబడులు మళ్లించడం మంచి చేస్తుంది. ఉద్గారాలు తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, బ్రెజిల్, చైనాల వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటోంది’ అని పేర్కొంది.