నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
అనంతపురం సిటీ : అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు నోడ్ల్ ఆఫీసర్ సీఈ రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్నాయక్తో కలిసి అనంతపురం జిల్లాలోని చియ్యేడు, పూల కుంట, మడకశిర, మడకశిర సమీప గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పాటు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రధాన పైపులైన్ పనులు జరుగుతుండడం వల్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు.
ఈ పనులు త్వరలో పూర్తికాగానే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఉండదన్నారు. పైప్లైన్ పనులు పూర్తయితే సమస్య తీరుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించామన్నారు. మరిన్ని మార్గాలు అన్వేషించి గ్రామాల్లో శాశ్వత తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.