ఉద్యోగ సమాచారం
ఆయుష్’లో వివిధ పోస్టులు
ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్త ఈస్టర్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి (ఎన్ఈఐఏహెచ్).. డెరైక్ట్ రిక్రూట్మెంట్/ కాంట్రాక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 110. దరఖాస్తుకు చివరి తేది జనవరి 4. వివరాలకు www.indianmedicine. nic.inచూడొచ్చు.
‘బెల్’లో ఇంజనీర్లు
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. వివిధ విభాగాల్లో డిప్యూటీ ఇంజనీర్ (ఖాళీలు-5), ఆర్కిటెక్ట్ (ఖాళీలు-1), సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-9), డిప్యూటీ మేనేజర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు
www.bel-india.comచూడొచ్చు.
చిదంబరనార్ పోర్టలో వివిధ పోస్టులు
ట్యుటికోరిన్‌లోని వి.ఒ.చిదంబరనార్ పోర్ట ట్రస్ట్.. వివిధ విభాగాల్లో టగ్ మాస్టర్, డ్రైవర్, సుక్కాని పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.vocport. gov.in/port/userinterface/latestnews.aspxచూడొచ్చు.
కేంద్ర సమాచార సంస్థలో లీగల్ కన్సల్టెంట్లు
న్యూఢిల్లీలోని కేంద్ర సమాచార సంస్థ (సీఐసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 8. వివరాలకు www.cic.gov.inచూడొచ్చు.
బీఎస్ఎఫ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స (బీఎస్ఎఫ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 14-17. వివరాలకు www.bsf.nic.inచూడొచ్చు.
కేరళ ఐఐఐటీఎంలో వివిధ పోస్టులు
కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆపరేషన్స ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఫైనాన్స ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.iiitmk.ac.inచూడొచ్చు.
ప్రమాణాల వల్లే విజ్ఞాన్స్‌కు న్యాక్ ‘ఏ’ గ్రేడ్
హైదరాబాద్: విద్యాబోధనలో తాము అనుసరిస్తున్న అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల ఫలితంగానే విజ్ఞాన్స్ యూనివర్సిటీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించిందని విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలో ఉన్న వర్సిటీ ప్రాంగణంలో సోమవారం అభినందన సభ నిర్వహించామన్నారు. ఇక్కడి విద్యా వసతులు, విద్యార్థులకు అందుతున్న ఉజ్వల భవిష్యత్తు ఫలితంగానే న్యాక్ గుర్తింపు సాధించామని పేర్కొన్నారు. విద్యా విధానంలో మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం, ఆధునిక బోధనా పద్ధతులు, పరిశోధనాంశాల్లో ప్రాధాన్యతలే తమ విజయ రహస్యాలని తెలిపారు.
గణితంలో ఫెయిల్ చేశారంటూ ఆందోళన
డీఎస్ఈ ఎదుట విద్యార్థుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల్లో గణిత సబ్జెక్టులో అడ్డగోలుగా ఫెయిల్ చేశారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వేల మంది విద్యార్థులకు 0, 1, 2, 3, 4 చొప్పున మార్కులు వేసి, భవిష్యత్తును నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం పాఠశాల విద్యా డెరైక్టర్ (డీఎస్ఈ) కార్యాలయం ఎదుట వందలాదిమంది విద్యార్థులు ధర్నా చేశారు. పేపరు మూల్యాంకనంలో పొరపాట్లు చేశారని, అందుకే తామంతా ఫెయిల్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. అనంతరం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని, అన్యాయం జరిగితే విద్యార్థులకు న్యాయం చేస్తామని డెరైక్టర్ హామీ ఇచ్చారు.
‘డీఎడ్’ రీవాల్యూయేషన్ చేపట్టాలి
డీఈడీ, బీఈడీ విద్యార్థి సమాఖ్య డిమండ్
సాక్షి, హైదరాబాద్: డీఎడ్ చివరి సంవత్సరం విద్యార్థుల పరీక్ష పేపర్లు రీవాల్యుయేషన్ చేపట్టాలని రాష్ట్ర డీఈడీ, బీఈడీ విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. శనివారం విడుదలైన డీ ఎడ్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. దీని వెనుక అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ మేరకు సమాఖ్య సభ్యులు సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి, పాఠశాల విద్య డెరైక్టరేట్‌ను ముట్టడించారు. డెరైక్టర్ జి. కిషన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొండా గణేశ్, కార్యదర్శి నరేశ్, అశోక్, మున్నా తదితరులు పాల్గొన్నారు.
వేతన సవరణ వ్యత్యాసాలు సవరించాలి
సాంఘిక గురుకుల ఉపాధ్యాయ సంఘం
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ (పీఆర్సీ) నేపథ్యంలో ఎస్సీ గురుకుల సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతన వ్యత్యాసాలు సవరించాలని, హెల్త్కార్డులివ్వాలని సాంఘిక గురుకుల ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కాను కలసి వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలని, 10 పద్దు కింద జీతాలివ్వాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని కోరింది. ఎక్కాను కలసిన వారిలో సంఘం ప్రతినిధులు కె.అర్జున, జె.రామలక్ష్మణ్, రంగాస్వామి, దానం, నగేశ్, నర్సింహులు ఉన్నారు.
ఏపీ టెన్త్ ఫీజు గడువు 30 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు, వరదలు తీవ్రంగా ఉండడం, పాఠశాలల్లో కార్యకలాపాలు స్తంభించడంతో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపును ఏపీ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టరేట్ కమిషనర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 7 వరకు రూ.50, డిసెంబర్ 16 వరకు రూ.200, డిసెంబర్ 30 వరకు రూ.500 అపరాధ రుసుముతో చెల్లించవచ్చని వివరించారు.
టీఎస్‌తో పాటే ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు రూపొందించిన షెడ్యూల్‌తోనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు 2016 మార్చి 2 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో అవే తేదీల్లో ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు షెడ్యూల్‌ను విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు సమర్పించారు. ఒకట్రెండు రోజుల్లో ఏపీ షెడ్యూల్‌ను కూడా ఇదే తేదీల్లో ఉండేలా ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో ఇంటర్ పరీక్షలు మార్చి 11 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించడం తెలిసిందే. అలాగే పదో తరగతి పరీక్షలను కూడా తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్‌తో సమానంగానే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పరీక్షల విభాగం అధికారులతో ఏపీ అధికారులు చర్చించినట్లు సమాచారం.