ప్రజారోగ్యాన్ని కాపాడండి: ఎంపీ రాపోలు
హైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాపోలు ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను కలసి తెలంగాణలో డెంగ్యూ జ్వరాల వ్యాప్తి, ప్రజారోగ్యానికి కలుగుతున్న ముప్పును వివరించి వినతి పత్రాన్ని అందచేశారు.
వరంగల్ జిల్లాల్లో డెంగ్యూ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ గందరగోళంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డెంగ్యూ బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక బృందాలను తెలంగాణకు పంపాలని మంత్రికి విన్నవించారు.