అలెగ్జాండర్ ప్రాణం తీసిన సెల్ ఫోన్
సెల్‌ఫోన్ మరో యువకుడి ప్రాణం తీసింది. సెంట్రల్ రిపబ్లిక్ ఆఫ్ కోమిలోని జపొలెర్నీ గ్రామంలో అలెగ్జాండర్ ఎం. అనే యువకుడు టబ్‌లో స్నానం చేస్తూ... ఛార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ తీసుకునేందుకు ప్రయ్నతించాడు. ఆ క్రమంలో చేతిలో నుంచి సెల్‌ఫోన్ ప్రమాదవశాత్తూ నీటిలో పడింది. దీంతో కరెంట్ షాక్ కోట్టి అతడు అక్కడికక్కడే మరణించాడు.
అయితే అలెగ్జాండర్ స్నానానికి వెళ్లి చాలా సేపు అయింది. బాత్రూమ్ నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో అతడి సోదరుడు తలుపు తట్టాడు. కానీ లోపల నుంచి ఎటువంటి స్పందన లేదు. అంతే బాత్రూమ్ తలుపు పగలు కొట్టాడు. టబ్‌లో వీగత జీవిగా పడి ఉన్న అలెగ్జాండర్‌ను చూసి అతడి సోదరుడు హతాశుడయ్యాడు.
అతడి మృతదేహం పక్కనే నీటిలో తెలియాడుతున్న సెల్ ఫోన్ గుర్తించాడు. అలెగ్జాండర్ మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి పొత్తికడుపు వద్ద కాలిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సెల్‌ఫోన్ కారణంగా కరెంట్ షాక్ వల్లే అతడు మరణించినట్లు వైద్యులు శవ పరీక్ష చేసి నిర్థారించారు.
అలెగ్జాండర్ స్థానిక యూనివర్శిటీలో చదువుతున్న చురుకైన విద్యార్థి అని గుర్తు చేసుకున్నాడు. అయితే అలెగ్జాండర్ ఎలాంటి మోడల్ సెల్‌ఫోన్ వాడుతున్నాడు.... బాత్రూమ్ టబ్ వద్దకి సెల్‌ఫోన్ తీసుకురావద్దు అనే విషయం అతడికి స్పష్టంగా తెలియలేదని సోదరుడు వాపోయాడు.
ఇలాంటి సంఘటనే గత నెల మాస్కోలో చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక స్నానం చేస్తూ బాత్రూమ్లో కరెంట్ షాక్ కోట్టి మరణించింది. అయితే బాలిక చేతిలో ఛార్జర్ ఉండగా... నేల మీద సెల్ ఫోన్ ఉందని సదరు బాలిక తల్లి చెప్పింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అపిల్ చేసిన పరిశోధనలో చైనాలో సెల్ ఫోన్ ఛార్జీంగ్ పెడుతు మహిళ మరణించిన విషయాన్ని 2013లోనే గుర్తించింది. వివిధ రకాల మోడల్ సెల్ఫోన్లు అధికంగా వేడెక్కుతున్నాయని....అలాగే పేలుళ్లు సంభవిస్తున్న విషయాన్ని అపిల్ సంస్థ గమనించింది.