ప్రపంచ వృద్ధి కంపెనీల్లో 17 భారత సంస్థలకు చోటు..
డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన ప్రపంచ వృద్ధి కంపెనీల జాబితాలో 17 భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అవెస్థాజెన్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫినోలెక్స్, 4జీ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఏఎన్ఐ టెక్నాలజీస్, జస్ట్‌డయల్, మేక్మైట్రిప్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, రాడికల్ ఫుడ్స్, 4జీ ఐడెంటిటీ సొల్యూషన్స్ వంటివి ఇందులో కొన్ని.
కాగా, భవిష్యత్తు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగే సామర్థ్యం ఉన్న కంపెనీలను తాము నామినేట్ చేసినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఎంచుకున్న కంపెనీల్లో బ్యాం కింగ్, రిటైల్, ఈ-కామర్స్, ఐటీ, కెమికల్స్, ఎనర్జీ ఇలా విభిన్న రంగాలకు చోటు కల్పించినట్లు తెలిపింది. మొత్తం జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 370 కంపెనీలకు పైగా ఉన్నాయి.