స్టార్ స్పోర్ట్స్ నుంచి రెండు హెచ్డీ చానెళ్లు
హైదరాబాద్: క్రీడాభిమానుల కోసం స్టార్ ఇండియా నెట్వర్క్ నుంచి కొత్తగా రెండు హైడెఫినేషన్ (హెచ్డీ) చానెళ్లు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ పోటీలను అత్యంత స్పష్టతతో భారత ప్రేక్షకులకు అందించేందుకే స్టార్ స్పోర్ట్స్‌లో హెచ్డీ1, హెచ్డీ2 చానెళ్లను ప్రారంభించామని సంస్థ సీఈఓ నితిన్ కుక్రేజా తెలిపారు. ఇందులో కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లే ప్రసారమవుతాయి.
ప్రీమియర్ లీగ్, బుండెస్లీగ్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్, ఫార్ములావన్లాంటి స్పోర్ట్స్‌ను ప్రసారం చేస్తామని ఆయన చెప్పారు. ప్రేక్షకులకు హైడెఫినేషన్ అనుభూతిని అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో అందిస్తామని కుక్రేజా తెలిపారు. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ స్టాండర్డ్ చానెల్లో ప్రసారమవుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లు (ఫుట్‌బాల్, టెన్నిస్, ఫార్ములావన్) ఈ అక్టోబర్ 31 వరకు వస్తాయి. ఆ తర్వాత పూర్తిగా హెచ్డీ చానెళ్లలోనే ప్రసారమవుతాయని ఆయన చెప్పారు.