గణిత మేధావి రామకృష్ణకు సన్మానం
విజయవాడ (మొగల్రాజపురం): క్యూబ్రూట్లో ప్రపంచ రికార్డు సాధించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వెండ్ర రామకృష్ణ శనివారం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడను సందర్శించారు. సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి, మా లక్ష్మి ప్రాపర్టీస్ సీఈవో సందీప్ మండవ తదితరులు రామకృష్ణను సన్మానించారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రముఖæ శాస్త్రవేత్తలకు సాధ్యపడని ఘనమూలంలో భాగహార పద్ధతిని కనుగొని దానిపై భారత ప్రభుత్వం నుంచి కాపీరైటు హక్కును రామకృష్ణ పొందారని తెలిపారు. వివిధ ప్రపంచ రికార్డు పుస్తకాల్లో రామకృష్ణ స్థానం సంపాదించుకోవడం సంతోషకరమన్నారు. లయోలా కళాశాల అధ్యాపకుడు శ్రీనివాసరెడ్డి, చింపిరయ్య, చందుకార్తిక్ పాల్గొన్నారు.