వివాహిత దారుణహత్య
కుప్పం రూరల్, న్యూస్‌లైన్: కడ వరకు కాపాడుకుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధం మోజులో పడి భార్యను కడ తేర్చేందుకు పథకం పన్నాడు. స్నేహితుని సాయంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చందం పంచాయతీ కొత్తఇండ్లు గ్రావూనికి చెందిన చంద్రకళ (28)కు దళావారుు కొత్తపల్లె వాసి బాలాజీ(34)తో 2001 లో వివాహమైంది. వీరి పిల్లలు భార్గవ్(7), నిహారిక(4). బాలాజీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో భార్యను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడైన ప్రభాకర్‌తో కలసి పథకం పన్నాడు. నూలుకుంట గ్రావుం వద్దనున్న సుబ్రవుణ్య స్వామి ఆలయంలో పూజలు చేస్తే దంపతుల మధ్య కలతలు తీరుతాయని నమ్మిం చాడు. బాలాజీ, ప్రభాకర్ గురువారం ఉదయం చంద్రకళను ఇండిక కారు (ఏపీ02క్యూ4999)లో దేవాలయుం వద్దనున్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. పూజ కోసమంటూ చంద్రకళ కళ్లకు గంతలు కట్టారు. ఆపై రాళ్లు, దుడ్డుకర్రలతో అతికిరాతకంగా దాడి చేసి చంపారు.
ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం పన్నారు. వుృతదేహాన్ని కారులో తీసుకుని కుప్పం-క్రిష్ణగిరి జాతీయు రహదారిపై వచ్చారు. అయితే పగటి పూట ట్రాఫిక్ అధికంగా ఉండడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. కుప్పం నుంచి తమిళనాడులోని వేపనపల్లెకు వెళ్లే దారిలోనున్న అటవీ ప్రాంతంలో చంద్రకళ మృతదేహాన్ని దాచారు.
చంద్రకళ కనబడడం లేదంటూ ఆమె బంధువులకు గురువారం సాయంత్రం సమాచారమిచ్చారు. దీంతో బంధువులు బాలాజీ ఇంటికి వచ్చి నిలదీ శారు. వీరిపై బాలాజీ, అతని స్నేహితులు దాడి చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని సీఐ రాజగోపాల్‌రెడ్డి, ఎస్ఐ గంగిరెడ్డి తెలిపారు.