మంత్రి ఈటలను అడ్డుకున్న చల్లూరు గ్రామస్తులు
కరీంగనర్: వీణవంక మండలం చల్లూరులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్ కలిసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. బాధితురాలు పోలీస్ శిక్షణకు హాజరైనట్టు ఉన్న ఆధారాలను గ్రామస్తులు మంత్రికి చూపించారు.
అత్యాచారానికి గురైన బాధితురాలు శిక్షణకు హాజరు కాలేదని డీఎస్పీ ఎలా చెబుతారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఓ దళిత యువతి (20)పై ముగ్గరు కీచకులు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కానీ, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మంత్రి ఈటలకు తమ గోడు చెప్పుకున్నారు.