‘అసెంబ్లీ’కి మళ్లీ మార్పులు
సాక్షి, అమరావతి: వెలగపూడిలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనంలో మళ్లీ మార్పులు చేయనున్నారు. స్పీకర్ కోడెల ఆమోదం తెలిపిన అసెంబ్లీ భవనం డిజైన్లో బుధవారం సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించారు. ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలు కూర్చొనే విధంగా అసెంబ్లీ హాలు నిర్మాణం జరుగుతోంది.
హాలును మరింత పెద్దది చేయాలని, మరికొన్ని మార్పులు చేయాలని తాజాగా ఆదేశించారు. కాగా, రాజధానిలోని రోడ్లు సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.