దెందులూరులో మరో 10 మందికి అస్వస్థత
దెందులూరు: దెందులూరులోని పెద దళితపేటలో మరో పది మంది అస్వస్థతకు గురయ్యారు. పెద దళితపేటలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు పది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ కమ్యూనిటీ హెల్త్సెంటర్లో చేరారు. స్టాఫ్ నర్సులు, సెలైన్లు పెట్టి మందులు ఇచ్చారు. బుధవారం 37 మంది, తర్వాత మరో పది మంది అస్వస్థతకు గురికావడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీ కుళాయిల నీరు తాగొద్దు
గ్రామ పంచాయతీ వీధి కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిని తాగవద్దని, మాంసం, చేపలు తినవద్దని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని గ్రామ కార్యదర్శి ఎం.అనూష గ్రామంలో మైక్ ప్రచారం చేయించారు. కో-ఆపరేటివ్ సొసైటీలో ఉచితంగా సురక్షితమైన తాగునీటిని టిన్నుల ద్వారా అందిస్తున్నారని, వీటిని వినియోగించాలని సూచించారు.