Cherries
-
ఈ చెర్రీలు ఒక్కోక్కటే ఏకంగా..రూ. 25 వేలు!
మన దేశంలోని వివిధ నగరాల్లో సాధారణంగా చెర్రీలు కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటిని జూనో హార్ట్ చెర్రీలని, అవ్మోరీ చెర్రీలని అంటారు. మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, రుచిలో మరింత తీపిగాను ఉంటాయి. వీటి ఆకారం మిగిలిన చెర్రీల్లా గుండ్రంగా కాకుండా, హృదయాకారంలో ఉంటుంది. వీటిని కిలోల చొప్పున అమ్మరు. ఒక్కొక్క పండుకే ధరకట్టి ఆ లెక్కన అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చెర్రీలు ఒక్కొక్కటి 296 డాలర్ల (సుమారు 25 వేలు) వరకు ధర పలుకుతాయి. ఇవి 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో ఉంటాయి. సాధారణ చెర్రీల కంటే వీటిలో చక్కెర 20 శాతం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
Health Tips: ఈ పండ్ల గింజల్లో ‘సైనైడ్’.. పొరపాటున కూడా తినకండి! ఒకవేళ..
Are These Seeds Poisonous: కొన్ని రకాల పండ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే కొన్ని పండ్ల విత్తనాలను పొరపాటునో లేదంటే కావాలనో తరచూ తింటే.. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆపిల్ రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఆపిల్ మంచిదే అయినా.. ఆపిల్ గింజలు మాత్రం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుంటే వీటిలో ఉండే అమిగ్డాలన్.. సైనైడ్ను విడుదల చేస్తుంది. ఇది కడుపులోకి వెళ్లి విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. నిజానికి సైనైడ్ మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆపిల్ గింజల్లో ఇది తక్కువ స్థాయిలోనే ఉంటుంది. చెర్రీ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి చెర్రీ పండ్లు. కానీ చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఆపిల్ తినడం వల్ల కలిగే నష్టాలే కలుగుతాయి. ఆప్రికాట్ ఆప్రికాట్ విత్తనాలలో విషపదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటమే కాదు.. ప్రాణాల మీదికి వస్తుంది. ఈ విత్తనాలు ఒక వ్యక్తిని కోమాలోకి తీసుకెళతాయి. పీచ్ పీచ్ విత్తనాల్లో అమిగ్డాలిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, నెర్వస్ నెస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. పియర్ విత్తనాల్లో ప్రాణాంతకమైన సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే చెమట, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది కోమాకు కూడా దారితీస్తుంది. ఇంకా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముందు చెప్పినట్లుగా ఒకటీ రెండు సార్లు పొరపాటున అదీ ఒకటో రెండో గింజలు తింటే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ.. తరచూ తింటే మాత్రం ప్రమాదం బారిన పడినట్లే పరిశోధకులు అంటున్నారు. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
రబీలో సిరిధాన్యాల సాగు
కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు (6నెలల పంటయిన అరికలను ఖరీఫ్లో మాత్రమే వేసుకోవాలి) వంటి సిరిధాన్యాలను రబీ పంట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయదలచిన రైతులు ఒక్కరు గానీ, కొందరు కలిసి గానీ ఒకేచోట కనీసం 3 ఎకరాల నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తేనే పక్షుల తాకిడిని తట్టుకొని పంట దిగుబడిని తీసుకోగలుగుతారని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త కె. విజయకుమార్ తెలిపారు. సిరిధాన్యాల పంటలను పిచ్చుకలు, ఇతర చిన్న సైజు పిట్టలు ఇష్టంగా తింటాయి. ఖరీఫ్ కాలంలో అయితే వర్షాధారంగా పంట భూములన్నిటిలోనూ పంటలు ఉంటాయని, గడ్డి గింజలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి పిట్టలు సిరిధాన్య పంటలపైకి మరీ అంతగా దాడి చేయవన్నారు. రబీలో చాలా వరకు భూములన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి సిరిధాన్యాలకు పిట్టల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకని ఎకరం, రెండెకరాల్లో వేస్తే రైతుకు మిగిలేది అంతగా ఉండదంటూ.. కనీసం ఐదెకరాలు వేయడం మంచిదని విజయకుమార్ వివరించారు. ► గత జనవరిలో రైతుకు కిలో చొప్పున 6 వేల కిలోల సిరిధాన్యాల విత్తనాలను విజయకుమార్ ఉచితంగా ఇచ్చారు. విత్తనం తీసుకున్న రైతులు కొందరు సాగు చేశారు. కొందరు దాచి ఉంచారు. ప్లాస్టిక్ సంచిలో నుంచి తీసి గుడ్డ సంచి లేదా మట్టి పాత్రలో పోసి విత్తనాలను నిల్వ చేసుకున్న వారు నిశ్చింతగా ఇప్పుడైనా విత్తుకోవచ్చని ఆయన తెలిపారు. ► అయితే, కొందరు రైతులు ప్లాస్టిక్ ప్యాకెట్లో విత్తనాన్ని అలాగే ఉంచారు. వీరు ఆ విత్తనాన్ని విత్తుకునే ముందు విధిగా మొలక పరీక్ష చేసుకోవాలన్నారు. కొబ్బరి చిప్పలోనో, ప్లాస్టిక్ గ్లాసులోనో అడుగున చిన్న చిల్లి పెట్టి, మట్టి నింపాలి. తగుమాత్రంగా నీరు పోసి 2 గంటల తర్వాత 10–20 విత్తనాలు వేసి తేలికగా మట్టి కప్పేయాలి. రకాన్ని బట్టి 3–7 రోజుల మధ్య మొలక వస్తుంది. మొలక తక్కువగా ఉంటే ఆ ధాన్యం విత్తనానికి పనికిరాదని గుర్తించాలి. ఇప్పటికీ సాగు చేసే ఆలోచన లేని రైతులు విత్తనాన్ని వృథా చేయకుండా ఆసక్తి గల ఇతర రైతులకైనా ఇవ్వాలని విజయకుమార్ సూచించారు. ► ప్రస్తుత రబీ కాలంలో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, బరిగెలు, గోల్డు బరిగలను సాగు చేయవచ్చు. వీటి పంటకాలం 10–80 రోజులు. ఎకరానికి 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేలల్లోనైనా పండుతాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం చాలు. ► కొర్రలో జడ కొర్ర, ముద్ద కొర్ర రకాలుంటాయి. ముద్ద కొర్రకంకిపై నూగు పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి పిచ్చుకలు తినడానికి అవకాశం ఉండదు. 85–95 రోజుల్లో కోతకు వస్తాయి. నల్లరేగడి, తువ్వ, ఎర్రచెక్క, ఇసుక నేలల్లో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చౌడు గరప నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. 3 లేదా 4 తడులు అవసరం. ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు. ► ఊదలు ఎటువంటి నేలల్లోనైనా సాగు చేయవచ్చు. ఒకమాదిరి జిగట, ఉప్పు నేలల్లోనూ, నీరు నిలువ ఉన్న నేలల్లోనూ సాగు చేయవచ్చు. భూమిని తేలికపాటుగా మెత్తగా దున్ని పశువుల ఎరువు ఎకరానికి 5 టన్నులు వేసి కలియదున్నాలి. అది లేకపోతే గొర్రెలు, ఆవుల మందను పొలంలో మళ్లించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. భూమి సారవంతంగా ఉంటే 8–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద నుంచి 110 రోజుల పంటకాలం. 5 సార్లు నీరు పారించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో అయితే నీరు పారించాల్సిన అవసరం లేదు. ► అండుకొర్రను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా పండుతుంది. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. దీన్ని పల్చగా విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. పలచగా ఉంటే ఎక్కువ పిలకలు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడకూడదు. యూరియా వేస్తే బాగా పెరిగి పడిపోతుంది. 90–105 రోజుల్లో పంట వస్తుంది. ముందుగా కోస్తే గింజలు నాసిరకంగా ఉంటాయి. బియ్యం సరిగ్గా ఉండవు. పిండి అవుతాయి. సిరిధాన్యాలు ఏవైనా సరే గింజ ముదిరి, కర్రలు బాగా పండాకే కోయాలి. అప్పుడే మంచి నాణ్యమైన దిగుబడి∙వస్తుంది. మంచి ధర కూడా పలుకుతుంది. సిరిధాన్యాలు సాగు చేసిన భూమి ఏగిలి మారి సారవంతమవుతుంది. సిరిధాన్యాల సాగుపై సలహాల కోసం విజయకుమార్ (98496 48498) ను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. -
చెర్రీలతో బోలెడు లాభాలు..
కొత్త పరిశోధన ఎర్రగా నిగనిగలాడే చెర్రీలను చాలామంది ఇష్టపడతారు. చెర్రీలు తరచుగా తీసుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. చిరుతిండి తినాలనిపించినప్పుడు వేపుడు పదార్థాలు కాకుండా, గుప్పెడు చెర్రీలు తీసుకోవడం మేలని వారు అంటున్నారు. తక్కువ కేలరీలు ఉండే చెర్రీలు బరువు తగ్గడానికి దోహదపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ఇవి వ్యాయామం వల్ల వచ్చే ఒంటి నొప్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు. చెర్రీలలో పుష్కలంగా లభించే ‘మెలటోనిన్’ వల్ల నిద్రలేమి సమస్య కూడా మటుమాయమవుతుందని చెబుతున్నారు. అలాగే, చెర్రీల్లో పుష్కలంగా ఉండే ‘ఆంథోసియానిన్’ వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని మిచిగాన్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు.