సైకిల్‌ను ఢీకొన్న బైక్.. వృద్దుడి మృతి
చెరుకుపల్లి (గుంటూరు జిల్లా): చెరుకుపల్లి మండలం ఏమినేనివారి పాలెం వద్ద సైకిల్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు (62) అనే వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.