chester le street
-
1st T20I: నేడు ఇంగ్లండ్, భారత మహిళల తొలి టి20
కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చోటే భారత మహిళలు ఇప్పుడు ఇంగ్లండ్‌పై గెలిచేందుకు శ్రమించనున్నారు. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి పొట్టి మ్యాచ్ నేడు చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరుగుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న హర్మన్‌ప్రీత్ సేన ఫినిషింగ్ లోపాలతో ‘బంగారం’లాంటి అవకాశాన్ని చేజార్చుకుంది. బ్యాటింగ్‌లో అప్పటిదాకా బాగా ఆడే అమ్మాయిలు విజయానికి చేరువగా వచ్చి చేతులెత్తేయడం ఐసీసీ ఈవెంట్లలో పరిపాటిగా మారింది. అయితే ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘కామన్వెల్త్లో మేం బాగా ఆడాం. కానీ ఇంకా మెరుగవ్వాలి. లోపాలు సరిదిద్దుకోవాల్సి వుంది’ అని కెప్టెన్ చెప్పింది. రా.గం. 11.30 నుంచి జరిగే మ్యాచ్‌ను సోనీ టెన్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
శ్రీలంక ఘనవిజయం
157 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి శ్రీలంక దీటైన జవాబిచ్చింది. దిల్షాన్ (101 బంతుల్లో 88; 7 ఫోర్లు) భారీ అర్ధసెంచరీకి తోడు బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 157 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రియంజన్ (33 బంతుల్లో 43), సంగక్కర (40) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన ఇంగ్లండ్ 26.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది. తాత్కాలిక కెప్టెన్ మోర్గాన్ (40) మినహా... లంక బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. కులశేఖర (3/15) మూడు వికెట్లతో టాపార్డర్‌ను కూల్చగా, సేననాయకే (4/13) నాలుగు వికెట్లతో మిగిలిన పనిని పూర్తి చేశాడు. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది.