డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 33,500 పాయింట్లు: నొమురా
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మంచి పురోగతిలో ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ- నొమురా తన తాజా నివేదికలో అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ డిసెంబర్ నాటికి 33,500 పాయింట్లకు చేరుతుందన్నది తమ అంచనా అని సంస్థ భారత్ చీఫ్ ఎకనమిస్ట్ సోనల్ వర్మ ఇక్కడ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5.6 శాతంగా ఉంటుందని డీబీఎస్ పేర్కొంది. గత ఏడాది ఈ రేటు 6.1 శాతం.