14వ లీగల్ సెల్ అథారిటీ సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : సామాన్య ప్రజలకు న్యాయవ్యవస్థను దగ్గర చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 14వ లీగల్ సెల్ అథారిటీ సదస్సును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ సొంత రాష్ట్రంలో ఈ సదస్సు జరగటం సంతోషంగా ఉందన్నారు. బంజారాహిల్స్ పార్క్ హయాత్ హోటల్ లో జరుగుతున్న ఈ సదస్సుకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొసాలే, కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు పాల్గొన్నారు.