హైదరాబాద్లో దొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్ సిటీ: నగరంలో నలుగురు సభ్యులున్న దొంగల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని ఏడు చోట్ల చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. రాత్రివేళ్లల్లో ఎవరూలేని సమయం చూసి అపార్టుమెంటుల్లో చోరీకి పాల్పడుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.