కోళ్ల వ్యాపారి అనుమానాస్పద మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పట్టణంలోని సిద్దారం రోడ్డులో నివాసం ఉండే ఎస్.వెంకటేశ్వరరావు (35) కోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. గురువారం సాయంత్రం అతడు ఇంట్లోనే చనిపోయాడు. అయితే, అతడు ఉరి వేసుకుని చనిపోయాడని భార్య చెబుతుండగా, అత్తింటి వారే కొట్టి చంపారని మృతుని సంబంధీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డీఎస్పీ కవిత ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.