Child criminals
-
కొండవెలగాడలో బోస్టన్ స్కూల్
నెల్లిమర్ల విజయనగరం : రాష్ట్రంలోనే ఏకైక బాల నేరస్తుల కారాగృహం(బోస్టన్ స్కూల్) రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర విభజన తరువాత గతంలో నిజామాబాద్‌లో ఉన్న బోస్టన్ స్కూల్ తెలంగాణకు తరలిపోయింది. దీంతో బాల నేరస్తులకు వసతి కల్పించేందుకు అవసరమయ్యే ప్రత్యేకమైన కారాగృహం లేకుండాపోయింది. దీంతో జిల్లాలో బోస్టన్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ అధికారులు యోచించారు. ఇక్కడే జిల్లా జైలును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి వెళ్లే దారిలో రూ.25 కోట్లతో బోస్టన్ స్కూల్, జిల్లా జైలుకు అవసరమయ్యే భవనాల నిర్మాణం పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి.రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్న ఒక్కగానొక్క బోస్టన్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోవడంతో రాష్ట్రానికి సంబంధించిన బాల నేరస్తులను ఎక్కడ ఉంచాలో తెలియని అయోమయ స్థితిలో జైళ్ల శాఖ అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు విజయనగరం జిల్లాలో నెలకొల్పాలని యోచించి కొండవెలగాడ గ్రామానికి వెళ్లే దారిలో 25ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి, బాల నేరస్తులను ఇక్కడికి రప్పించాలని జైళ్లశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడే జిల్లా జైలును కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా జైలు ఏర్పాటుతో విజయనగరం, చీపురుపల్లి, సాలూరు, ఎస్.కోట ప్రాంతాల్లోని సబ్‌జైళ్లలో ఉన్న ఖైదీలను ఎప్పటికప్పుడు ఒకే చోటుకు చేర్చేందుకు అవకాశముంది. రిమాండ్ ఖైదీలతో పాటు శిక్ష ఖరారైన ఖైదీలకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవకాశం కలుగుతుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. చురుగ్గా బోస్టన్ స్కూల్ నిర్మాణం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామ పరిధిలో బోస్టన్ స్కూల్ నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. అక్కడే జిల్లా జైలు నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఇటీవల మా ఉన్నతాధికారులు సందర్శించి, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం. –గణేశ్, సబ్‌జైలు సూపరింటెండెంట్, విజయనగరం -
ఆరుగురు బాల నేరస్తులు పరార్
హైదరాబాద్: అబ్జర్వేషన్ హోం నుంచి ఆరుగురు బాల నేరస్తులు పారిపోయారు. భద్రతాలోపాలను వారు ఆసరాగా చేసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని శిక్షపడిన బాల నేరస్తులను నాగోలు కృషి నగర్‌లోని రోజ్ అబ్జర్వేషన్ హోంలో ఉంచుతారు. ఈ హోంలో శనివారం మధ్యాహ్నం సిబ్బంది భోజనం పెట్టిన అనంతరం మహేశ్, ఎండీ అఫ్రోజ్‌ఖాన్ అలియాస్ ఇప్పు, వేల్పు కిశోర్, సయ్యద్ షాహెద్, శ్యామ్‌సుందర్, శివసింగ్ అనే బాల నేరస్తులు పారిపోయారు. ఈ మేరకు అబ్జర్వేషన్ హోం నిర్వాహకులు సాయిలు ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భద్రత లేకనే.... ఇదే హోం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు బాల నేరస్తులు సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. సరైన భద్రత లేకపోవడం వల్లే బాల నేరస్తులు తరచూ తప్పించుకుని పోతున్నారు. ప్రతిసారీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పారిపోయిన వారిని పట్టుకురావడం షరా మామూలేనని స్థానికులు పేర్కొంటున్నారు. -
పిల్లలతో దొంగతనాలు చేయిస్తున్న మహిళ అరెస్ట్
పిల్లలతో దొంగతనాలు చేయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాల నేరస్తులను చేరదీసి వారితో దొంగతనాలు చేయిస్తున్న మహిళను పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
బాల నేరస్తులు పరార్
నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రం నాగారం ప్రాంతంలో గల జువైనల్ నుంచి నలుగురు బాల నేరస్తులు పారిపోయారు. ఈ ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన ఇద్దరు సూపర్వైజర్లు సస్పెషన్‌కు గురిఅయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగారంలో ప్రాంతంలో గల బాలుర సంక్షేమం, సం స్కరణల సేవలు, వీధి బాలుర సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర పరిశీలక గృహంలో వివిధ నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తులలో నలుగురు ఈనెల 2న పారిపోయారు. కేంద్రంలో హెడ్ సూపర్వైజర్ ప్రభాకర్, సూపర్వైజర్ నాగవేందర్లు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాం తంలో బ్యారక్‌లో ట్యూబ్‌లైట్ వెలగటంలేదని సూపర్వైజర్లు బ్యారక్ గేట్‌ను తెరిచి లోపలకు వెళ్లారు. అయితే బ్యారక్ గేట్ తెరిచేముందు బ్యారక్ గేట్ ముందున్న గేట్‌కు తాళం వేశాకే బ్యారక్ గేట్‌ను తెరుస్తారు. కాగా ఆరోజు రెండు గేట్లు తెరిచి ఉంచి ట్యూబ్‌లైట్‌ను బాగుచేసేందుకు లోపలకు వెళ్లారు. ఇదే అదునుగా భావిం చిన ఓ బాల నేరస్తుడు బ్యారక్ నుంచి బయటకు వచ్చా డు. కొద్ది సేపయ్యాక గమనించిన సూపర్వైజర్లు బ్యారక్ గేట్లను మూసివేయకుండానే బాలుడి కోసం వెతికేందుకు బయటకు వచ్చారు. అదే సమయంలో బ్యారక్‌లో ఉన్న మరో ముగ్గురు బాల నేరస్తులు సైతం అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. బాలురల ను కోర్టులో హాజరు పరిచేందుకు బయటకు తీసుకెళ్తూ, తిరిగి తీసుకువచ్చే సమయంలో ప్రధాన గేట్‌కు తాళం వేయకుండా సిబ్బంది ఓ ఇనుప చువ్వను అడ్డం పెట్టేవారు. దీనిని గమనించిన బాల నేరస్తుడు గేట్‌వద్దకు పరుగెత్తుకు వచ్చి ఇనుప చువ్వను తొలగించి పారిపోయాడు. అతను పారిపోయిన కొద్ది సేపటికే మరో ముగ్గురు పారిపోయారు. ప్రస్తుతం బ్యారక్‌లో మొత్తం ఆరుగురు బాలనేరస్తులు శిక్ష అనుభవిస్తూన్నారు. వీరిలో ఒకరు పేపీ కోసం ఆదిలాబాద్‌కు వెళ్లగా, మరొక బాలుడు మాత్రం నలుగురు పారిపోయిన వారితో వెళ్లకుండా బ్యారక్‌లోనే ఉండిపోయాడు. పారిపోయే నలుగురిని వారించినా వినలేదని తెలిసింది. బాలుడి కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చిన సూపర్వైజర్లకు బ్యారక్‌లో నుంచి మరో ముగ్గురు పారిపోయారని తెలియటంతో నివ్వెరపోయారు. వెంటనే బాలుర పరిశీలక గృహం సూపరింటెండెంట్ ఆనంద్‌కు విషయం తెలుపటంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం బయటకు పొక్కక ముందే బాలురను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు దొరకక పోవడంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆనంద్‌ను ‘సాక్షి’ సంప్రదింరగా శిక్ష అనుభవిస్తున్న నలుగురు బాల నేరస్తులు పారిపోయిన మాటా వాస్తవేమేనని అన్నారు. బాలురు పారిపోయిన రోజే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు మాత్రం బాల నేరస్తులు తప్పించుకు పోయారంటూ తమకు శుక్రవారమే ఫిర్యాదు వచ్చిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. ఇదిలా ఉండగా బాల నేరస్తుల పారిపోయిన ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని హెడ్ సూపర్వైజరు ప్రభాకర్, సూపర్వైజర్ నాగావేందర్లను వెంటనే సస్పెండ్ చేసినట్లు బాలుర పరిశీలక గృహం సూపరింటెడ్ ఆనం ద్ తెలిపారు. పారిపోయిన బాలనేరస్తుల కోసం గాలిం పు చర్యలు చేపట్టామన్నారు.