హైదరాబాద్: అబ్జర్వేషన్ హోం నుంచి ఆరుగురు బాల నేరస్తులు పారిపోయారు. భద్రతాలోపాలను వారు ఆసరాగా చేసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని శిక్షపడిన బాల నేరస్తులను నాగోలు కృషి నగర్‌లోని రోజ్ అబ్జర్వేషన్ హోంలో ఉంచుతారు. ఈ హోంలో శనివారం మధ్యాహ్నం సిబ్బంది భోజనం పెట్టిన అనంతరం మహేశ్, ఎండీ అఫ్రోజ్‌ఖాన్ అలియాస్ ఇప్పు, వేల్పు కిశోర్, సయ్యద్ షాహెద్, శ్యామ్‌సుందర్, శివసింగ్ అనే బాల నేరస్తులు పారిపోయారు. ఈ మేరకు అబ్జర్వేషన్ హోం నిర్వాహకులు సాయిలు ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భద్రత లేకనే....
ఇదే హోం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు బాల నేరస్తులు సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. సరైన భద్రత లేకపోవడం వల్లే బాల నేరస్తులు తరచూ తప్పించుకుని పోతున్నారు. ప్రతిసారీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పారిపోయిన వారిని పట్టుకురావడం షరా మామూలేనని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆరుగురు బాల నేరస్తులు పరార్
Jan 15 2018 1:19 AM | Updated on Aug 21 2018 6:02 PM
Advertisement
Advertisement