child raped
-
ఘాతుకం.. చావు బతుకుల్లో చిన్నారి
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత బాబాయే ఓ పసిపాపపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ మృగం చేతిలో చితికిన చిన్నారి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. థాకూర్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో నగర్ నిగమ్ ప్రాంతానికి చెందిన చిన్నారి తండ్రి కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. అతని సోదరుడు(20) హోలీ సందర్భంగా ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఆ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. ఓ పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత పారిపోతున్న యువకుడిని గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాపను కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో శస్త్ర చికిత్స అవసరమైందని.. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
పుణే: ఇంట్లో నిద్రపోతున్న ఓ రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారంచేసి హత్యచేసిన దారుణం పుణేలో జరిగింది. శనివారం రాత్రి కిడ్నాపైన బాలిక ఆదివారం ఇంటి దగ్గర్లోని హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో శవమై కన్పించింది. పుణేలోని సింహగఢ్లో సదరు బాలిక దినసరి కూలీలైన తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. శనివారం రాత్రి తల్లితో కలిసి నిద్రపోతున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. చిన్నారి కన్పించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆదివారం ఇక్కడి హౌసింగ్ సొసైటీ దగ్గర ఓ బాలిక మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మృతదేహం కిడ్నాపైన బాలికదేనని నిర్ధారించారు. దుండగులు బాలికను రేప్ చేశాక గొంతునులిమి హత్య చేశారని ఏసీపీ శివాజీ మీడియాతో చెప్పారు. -
వేసింది ఖాకీ దుస్తులే.. కానీ!
పోలీసులు అనగానే.. ఖాకీ దుస్తుల కరకుదనమే మన కళ్లముందు కనిపిస్తుంది. లాఠీ పట్టుకుని ఎవరినైనా అదిలించడం, బెదరించడమే మనం ఇన్నాళ్లూ చూస్తూ వచ్చాం. కానీ, నాణేనికి రెండోవైపు చూస్తే వాళ్లలోనూ మానవత్వం ఉంది. తీవ్రమైన సమస్యల పట్ల స్పందించే హృదయం ఉంది. వారణాసిలోని ఫూల్పూర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సంజీవ్ మిశ్రా ఇలాంటి మానవత్వానికి నిలువెత్తు రూపం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తోంది. అదేంటో మీరూ చూడండి.. తన ఏరియాతో సంబంధం లేకపోయినా.. ఆస్పత్రిలో ఓ పాప చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్లు మిశ్రాకు సమాచారం అందింది. తన పరిధి అయినా, కాకపోయినా ఆయన ఊరుకోలేదు.. వెంటనే పరుగున ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెను అక్కడినుంచి వేరే ఆస్పత్రికి తరలిద్దామని చూస్తే, ఆస్పత్రి వర్గాలు ఏమాత్రం సహకరించలేదు. అయినా ఆయన ఊరుకోలేదు. స్ట్రెచర్లు, అంబులెన్సుల గురించి వేచి చూడలేదు. తన చేతుల్లోకి ఆ చిన్నారిని ఎత్తుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బయల్దేరారు. అంతటితో అయిపోలేదు.. ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారంటూ చుట్టుపక్కల వాళ్లు నస పెట్టారు. 'నేనే భరిస్తా.. నేనే ఆమె సంరక్షకుడిని' అని ఇన్స్పెక్టర్ మిశ్రా స్పష్టంగా చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ బాలికపై ఓ మధ్యవయసు వ్యక్తి అత్యాచారం చేశాడు. అతడిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అయితే ఆ నిరుపేద బాలికను మాత్రం పట్టించుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దాంతో ఇన్స్పెక్టర్ సంజీవ్ మిశ్రా మాత్రం ఊరుకోకుండా.. తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు.