చికిత్స పొందుతున్న బాలుడి మృతి
బొమ్మలరామారం
ప్రమాదవశాత్తు ఇంటి సజ్జా కూలడంతో గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతిచెందాడు. వివరాలు.. మండలంలోని మైలారం కింది తండాలో శుక్రవారం వినాయకుని మండపం ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి సజ్జా కూలడంతో పలువురు బాలలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రమావత్ దేవేందర్(15) భువనగిరి ఏరియా ఆసుపత్రి తరలించారు. కానీS దేవేందర్‌తో పాటు మరో బాలుడిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఈసీఐఎల్‌లోని ఓ ప్రై వేట్ ఆసుపత్రి తీసుకువెళ్లారు. దేవేందర్ పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మతిచెందాడు. వినాయక చవితి ఏర్పాట్లలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో మైలారం కింది తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.∙ l