Chill Bro Movie: మంగ్లీ ‘బొడ్రాయి’ సాంగ్ అదిరిందిగా!
సూర్య శ్రీనివాస్, పవన్ కేసి, రూపిక, ఇందు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చిల్ బ్రో. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీను చెంబేటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కుంచం శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిల్ బ్రో పబ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్షకులు నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.
తాజాగా ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన ‘బొడ్రాయి’పాటను చిత్ర బృందం విడుదల చేశారు. మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెరసీ ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత శ్రీను చెంబెటీ తెలిపారు.