నేడు రాజధానిలో చైనా బృందం సర్వే
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర రాజధాని ప్రాంతంలో గురువారం చైనా ప్రతినిధి బృందం సర్వే నిర్వహించనుంది. ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గేట్వే హోటల్లో అధికారులతో సమావేశమవుతారు. కలెక్టర్ బాబు ఈ సమావేశంలో పాల్గొంటారు. చైనా ప్రతినిధులు రోడ్డుమార్గంలో పర్యటిస్తారా? లేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారా అనేది నిర్ధారణ కాలేదు. రాజధాని ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుందనే వివరాలు, ఇతర కార్యాలయాల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని వారికి కలెక్టర్ తెలియజేస్తారు.
నేటి రాత్రి బెజవాడలో సీఎం బస
సీఎం చంద్రబాబు గురువారం రాత్రి విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న క్యాంపు కార్యాలయంలో బస చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి గురువారం రాత్రి 7.30 గంటలకు గన్నవరం వస్తారు.