గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
నార్పల : ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం కునుకుంట్ల ఫారెస్ట్ పరిధిలోని ముచ్చుకుంటపల్లి సమీపాన పేటకుంట వద్ద ట్రెంచ్ పనులు జరుగుతున్నాయి. మండలంలోని రంగాపురం ఉపాధి హామీ కూలీ (జాబ్‌కార్డ్ నంబర్–30090) చిన్న కుళ్లాయప్ప (49) గునపంతో మట్టిపెల్లలు పెకలిస్తూ కుప్పకూలిపోయాడు. తోటికూలీలు హుటాహుటిన నార్పలలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కుళ్లాయప్ప గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.