chintala raju
-
'అమెరికా ఉపాధ్యక్షుడికి నల్లగొండ దోస్తు'
వాషింగ్టన్: దక్షిణాసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ కీలకంగా మారుతున్న దేశం భారత్. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ పరిపాలనా కాలంలో భారతదేశానికి అమెరికాకు మధ్య సంబంధాలు మరింత పెరుగుతాయని ట్రంప్ పరిపాలన వర్గం భారత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుందని పక్కా సమాచారం. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ప్రస్తుతం అమెరికాకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న మైక్ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడు రాజు చింతల. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు చెందిన రాజు చింతల గత పదేళ్లుగా మైక్ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఇండియానా గవర్నర్‌గా మైక్ పెన్స్ అవతరించేవరకు కూడా రాజు చింతల పెన్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇండియానా నుంచి వాషింగ్టన్లో దిగారు. వాషింగ్టన్లో కొలువు దీరనున్న కొత్త అమెరికా ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో రాజు చింతల పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. 'దక్షిణాసియా దేశాల్లో అమెరికా తరుపున కీలక పాత్ర ఒక్క భారత్ మాత్రమే పోషించగలదని అమెరికా భావిస్తోంది. పైగా అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను అమెరికా భావిస్తోంది. ట్రంప్ ఆధ్వర్యంలో కచ్చితంగా భారత్, అమెరికాల మధ్య బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ విభాగంలో.. అలాగే ఉగ్రవాదం విషయంలో కూడా ట్రంప్ భారత్‌తో కలిసి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఐసిస్‌ను తుదముట్టించేందు ట్రంప్ కూడా సన్నద్ధమవుతున్నారు. మైక్ పెన్స్ ఈ ఏడాది భారత్‌లో పర్యటించాలని అనుకుంటున్నారు. దాని ద్వారా భారత్‌లో అమెరికా ఎగుమతులకు మరింత ఊపునివ్వాలని భావిస్తున్నారు' అని ఆయన చెప్పారు. -
భార్యతో గొడవపడి ఇంటికి నిప్పు పెట్టాడు!
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన ఇంటికే నిప్పు పెట్టుకున్న ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అపార్టుమెంట్ మొత్తం పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. మైసమ్మగూడకు చెందిన చింతల రాజు, మంజుల, తన ఇద్దరు కుమారులతో కలిసి బహదూర్‌పల్లిలోని మహేశ్ క్యాసిల్ అపార్టుమెంట్‌లోని 204 ఫ్లాట్‌లో ఉంటున్నాడు. శనివారం రాత్రి 10 గంటల తప్పతాగి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైగ అపార్టుమెంట్ మొత్తం అలుముకుంది. స్థానికులు దుండిగల్ పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్కఫ్లాట్స్ ( 201, 203, 205) లో ఉండే వారు సెలవులకు ఊళ్లకు వెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. నిందితుడు రాజును పోలీసులు స్టేషన్‌కు తరలించారు.