చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ హంగామ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు నానా హంగామా చేశారు. ఇల్లుకట్టుకోవాలంటే డబ్బు ఇవ్వాలంటూ చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి హల్చల్ చేశారు. ఓ ఇంటి యజమాని ఇల్లు కట్టుకోవాలనుకోగా అలా చేయాలంటే తనకు రూ.10లక్షలు ఇవ్వాలంటూ ఇంటి యజమానిపై కార్పొరేటర్ విఠల్ రెడ్డి గత కొంతకాలంగా ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించి డబ్బు ఇవ్వకపోవడంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటి నిర్మాణం కోసం వచ్చిన కార్మికులపై 30మంది అనుచరులతో కలిసి విఠల్ రెడ్డి దాడి చేశారు.