ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించేందుకు చేపట్టిన డిండి ప్రాజెక్టు పనుల టెండర్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నట్వ గిరిధర్, బోరిగం భూపాల్, గుర్రం జగన్, ఎల్లెంకి అశోక్, ఎల్లెంకి చంద్రశేఖర్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎండి.ఖాలెద్, సలీం, ఉజ్జిని రఘురాంరావు, ఎదుళ్ళ గిరిబాబు, ఉడుతల అక్రం, విజయ్‌కుమార్, శీలం సత్తయ్య, మహేందర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.