చేనేత షోయగం
పోచంపల్లి వస్త్ర సోయగం.. సిటీవాసులను పలకరించింది. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం పోచంపల్లి ఇకత్ ఆర్ట్మేళాను టాలీవుడ్ నటి మనాలి రాథోడ్ ప్రారంభించింది. లంగాఓణిలో తళుక్కుమన్న రాథోడ్.. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ష్యాషన్ లుక్.. ట్రెడిషనల్ మార్క్.. ఈ రెండూ చేనేత వస్త్రాల్లోనే కనిపిస్తాయన్నారామె. తాను కూడా చేనేత వస్త్రాలను ఇష్టంగా ధరిస్తానని చెప్పారు. ఈ నెల 21 వరకు కొనసాగే ప్రదర్శనలో..
డిజైనర్ శారీస్, సిల్క్ అండ్ కాటన్ డ్రస్ మెటీరియల్స్, కుర్తాలు, టేబుల్ లెనిన్ వంటి రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.