‘గురుకులం’లో మిగులు సీట్ల భర్తీ
జడ్చర్ల : బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త బి.కష్ణారావు తెలిపారు. మంగళవారం జడ్చర్ల మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాత, ఈ ఏడాది ప్రారంభించిన బాలురు, బాలికల గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో మిగిలిపోయిన 150సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులతో భర్తీ చేశామన్నారు. ఇంకా మిగిలిపోయిన సీట్లుంటే మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ కార్యాలయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాంలక్ష్మయ్య, స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల కష్ణయ్య పాల్గొన్నారు.