chiyyedu
-
చియ్యేడుకు పశువైద్యుడి నియామకం
సాక్షి ఎఫెక్ట్....!! అనంతపురం అగ్రికల్చర్: పశు వైద్యుడు లేక చియ్యేడులోని రైతులు పడుతున్న ఇబ్బందులపై గతనెల 26న ‘మాటరాని మౌనం’ పేరుతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పశుసంవర్ధకశాఖ అధికారులు స్పందించారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పశువుల ఆస్పత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీసిన జేడీ డాక్టర్ బి.సన్యాసిరావు అక్కడ పశువైద్యాధికారి నియామకానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న డాక్టర్ రమను చియ్యేడు ఆస్పత్రి డాక్టరుగా నియమించినట్లు జేడీ సన్యాసిరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే మరికొన్ని ఆస్పత్రులకు వైద్యులను నియమించడానికి, పశుభవనాల నిర్మాణం, ఇతరత్రా మౌలిక వసతులు, మందుల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
హోరాహోరీగా ఫైనల్స్
అనంతపురం రూరల్ : మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న గ్రిగ్‌పోటీల్లో బుధవారం ఫైనల్స్ హోరాహోరీగాస్‌గాయి. విద్యార్థులంతా విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. విజేతలు వీరే బాలుర జూనియర్స్ విభాగం: కబడ్డీలో పప్పురు గురుకుల పాఠశాల జట్టు విన్నర్స్‌గా నిలవగా, రూట్స్ పబ్లిక్ స్కూల్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. సాఫ్ట్‌బాల్ పోటీల్లో విన్సెంటి ది పాల్ పాఠశాల జట్టు విన్నర్స్‌గా నిలవగా, బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. త్రోబాల్ పోటీల్లో అనంతపురం న్యూటౌన్ పాఠశాల విన్నర్‌గా నిలవగా, శ్రీ చైతన్య పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. టెన్నికాయిట్ పోటీల్లో పెనకచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజేతగా నిలవగా, ఆలమూరు ఉన్నత పాఠశాల జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది. బాలుర సీనియర్స్ విభాగం: వాలీబాల్‌లో శింగనమల ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలవగా, ఆక్స్ఫర్డ్ పాఠశాల జట్టు రెండోస్థానంతో సరిపెట్టుకుంది. త్రోబాల్ పోటీల్లో శ్రీచైతన్య పాఠశాల జట్టు విన్నర్స్‌గా, అనంతపురం న్యూటౌన్ ఉన్నత పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచాయి. టెన్నికాయిట్ పోటీల్లో పెనకచెర్ల ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలవగా, వడియంపేట కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు రెెండోస్థానంలో నిలిచారు. -
హోరాహోరీగా గ్రిగ్స్ పోటీలు
అనంతపురం రూరల్ : అనంతపురం జోన్–1 గ్రిగ్స్ పోటీలు మంగళవారం హోరాహోరీగా జరిగాయి. రూరల్ మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపు 100కు పైగా వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, త్రోల్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, షటిల్‌కాక్ తదితర వాటిల్లో వివిధ పాఠశాలల జట్లు తలపడ్డాయి. సెమీస్ చేరిన బాలుర జట్లు బ్యాడ్మింటన్ సీనియర్ విభాగంలో తోపుదుర్తి ఉన్నత పాఠశాల జట్టు, పెనకచెర్ల డ్యాం జట్టు, జూనియర్ విభాగంలో ఆలమూరు పాఠశాల జట్టు సెమీస్‌కు చేరాయి. వాలీబాల్ జూనియర్ విభాగంలో కొర్రపాడు ఉన్నత పాఠశాల, త్రోబాల్ సీనియర్ విభాగంలో పెనకచెర్ల డ్యాం, అనంతపురం న్యూటౌన్ పాఠశాల జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కబడ్డీ సీనియర్స్ విభాగంలో శిద్ధరాంపురం ఉన్నత పాఠశాల జట్టు, జూనియర్ విభాగంలో పప్పూరు గురుకుల పాఠశాల, తరిమెల ఉన్నత పాఠశాల, వడియంపేట కేశవరెడ్డి పాఠశాల జట్లు సెమీస్‌కు చేరాయి. నేడు ఫైనల్స్ బుధవారం ఉదయం 10 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి బాలికల, బాలుర విభాగాలకు అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఈటీలు శివారెడ్డి, లింగమయ్య, ప్రభాకర్, అక్కులప్ప, సిరాజుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీతో విద్యార్థిని మృతి
అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండలం చియ్యేడుకు చెందిన వెంకటలక్ష్మి, వెంకటరాముడు దంపతుల కుమార్తె ఈశ్వరమ్మ(14) డెంగీతో శుక్రవారం మరణించింది. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె శనివారం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ రెండ్రోజల పాటు చికిత్స చేసిన తరువాత ఏ జ్వరమో చెప్పకుండా డాక్టర్లు చేతులెత్తేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో హుటాహుటిన బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీగా నిర్ధరించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చివరకు మతి చెందినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం పెద్దాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మతి చెందిందని వారు ఆరోపించారు. విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ వరప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ ఉజ్జినప్ప, కురుగుంట ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థిని మతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.