హోరాహోరీగా గ్రిగ్స్ పోటీలు
అనంతపురం రూరల్ : అనంతపురం జోన్–1 గ్రిగ్స్ పోటీలు మంగళవారం హోరాహోరీగా జరిగాయి. రూరల్ మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపు 100కు పైగా వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, త్రోల్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, షటిల్‌కాక్ తదితర వాటిల్లో వివిధ పాఠశాలల జట్లు తలపడ్డాయి.
సెమీస్ చేరిన బాలుర జట్లు
బ్యాడ్మింటన్ సీనియర్ విభాగంలో తోపుదుర్తి ఉన్నత పాఠశాల జట్టు, పెనకచెర్ల డ్యాం జట్టు, జూనియర్ విభాగంలో ఆలమూరు పాఠశాల జట్టు సెమీస్‌కు చేరాయి. వాలీబాల్ జూనియర్ విభాగంలో కొర్రపాడు ఉన్నత పాఠశాల, త్రోబాల్ సీనియర్ విభాగంలో పెనకచెర్ల డ్యాం, అనంతపురం న్యూటౌన్ పాఠశాల జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కబడ్డీ సీనియర్స్ విభాగంలో శిద్ధరాంపురం ఉన్నత పాఠశాల జట్టు, జూనియర్ విభాగంలో పప్పూరు గురుకుల పాఠశాల, తరిమెల ఉన్నత పాఠశాల, వడియంపేట కేశవరెడ్డి పాఠశాల జట్లు సెమీస్‌కు చేరాయి.
నేడు ఫైనల్స్
బుధవారం ఉదయం 10 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి బాలికల, బాలుర విభాగాలకు అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఈటీలు శివారెడ్డి, లింగమయ్య, ప్రభాకర్, అక్కులప్ప, సిరాజుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.