grigs games
-
హోరాహోరీగా ఫైనల్స్
అనంతపురం రూరల్ : మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న గ్రిగ్‌పోటీల్లో బుధవారం ఫైనల్స్ హోరాహోరీగాస్‌గాయి. విద్యార్థులంతా విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. విజేతలు వీరే బాలుర జూనియర్స్ విభాగం: కబడ్డీలో పప్పురు గురుకుల పాఠశాల జట్టు విన్నర్స్‌గా నిలవగా, రూట్స్ పబ్లిక్ స్కూల్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. సాఫ్ట్‌బాల్ పోటీల్లో విన్సెంటి ది పాల్ పాఠశాల జట్టు విన్నర్స్‌గా నిలవగా, బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. త్రోబాల్ పోటీల్లో అనంతపురం న్యూటౌన్ పాఠశాల విన్నర్‌గా నిలవగా, శ్రీ చైతన్య పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. టెన్నికాయిట్ పోటీల్లో పెనకచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజేతగా నిలవగా, ఆలమూరు ఉన్నత పాఠశాల జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది. బాలుర సీనియర్స్ విభాగం: వాలీబాల్‌లో శింగనమల ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలవగా, ఆక్స్ఫర్డ్ పాఠశాల జట్టు రెండోస్థానంతో సరిపెట్టుకుంది. త్రోబాల్ పోటీల్లో శ్రీచైతన్య పాఠశాల జట్టు విన్నర్స్‌గా, అనంతపురం న్యూటౌన్ ఉన్నత పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచాయి. టెన్నికాయిట్ పోటీల్లో పెనకచెర్ల ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలవగా, వడియంపేట కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు రెెండోస్థానంలో నిలిచారు. -
హోరాహోరీగా గ్రిగ్స్ పోటీలు
అనంతపురం రూరల్ : అనంతపురం జోన్–1 గ్రిగ్స్ పోటీలు మంగళవారం హోరాహోరీగా జరిగాయి. రూరల్ మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపు 100కు పైగా వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, త్రోల్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, షటిల్‌కాక్ తదితర వాటిల్లో వివిధ పాఠశాలల జట్లు తలపడ్డాయి. సెమీస్ చేరిన బాలుర జట్లు బ్యాడ్మింటన్ సీనియర్ విభాగంలో తోపుదుర్తి ఉన్నత పాఠశాల జట్టు, పెనకచెర్ల డ్యాం జట్టు, జూనియర్ విభాగంలో ఆలమూరు పాఠశాల జట్టు సెమీస్‌కు చేరాయి. వాలీబాల్ జూనియర్ విభాగంలో కొర్రపాడు ఉన్నత పాఠశాల, త్రోబాల్ సీనియర్ విభాగంలో పెనకచెర్ల డ్యాం, అనంతపురం న్యూటౌన్ పాఠశాల జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కబడ్డీ సీనియర్స్ విభాగంలో శిద్ధరాంపురం ఉన్నత పాఠశాల జట్టు, జూనియర్ విభాగంలో పప్పూరు గురుకుల పాఠశాల, తరిమెల ఉన్నత పాఠశాల, వడియంపేట కేశవరెడ్డి పాఠశాల జట్లు సెమీస్‌కు చేరాయి. నేడు ఫైనల్స్ బుధవారం ఉదయం 10 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి బాలికల, బాలుర విభాగాలకు అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఈటీలు శివారెడ్డి, లింగమయ్య, ప్రభాకర్, అక్కులప్ప, సిరాజుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రిగ్స్‌లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు
పుట్టపర్తి అర్బన్ : ఇటీవల రామగిరిలో జరిగిన పూర్ణిమారావు గ్రిగ్స్‌పోటీల్లో పుట్టపర్తి మండల విద్యార్థులు సత్తా చాటారు. మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్ బాలుర వాలీబాల్‌లో విన్నర్స్‌గా, సీనియర్ బాలికలు షటిల్లో విన్నర్స్, బాలికల హాకీలో రన్నర్స్, జూనియర్ షటిల్లో గర్ల్స్ రన్నర్స్‌గా పథకాలు సాధించారని పీడీ నాగరాజు, హెచ్ఎం రామచంద్రారెడ్డి తెలిపారు. అదేవిధంగా బీడుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్ క్రికెట్ పోటీల్లో రన్నర్స్‌గా నిలిచినట్లు పీఈటీ వెంకటేష్, హెచ్ఎం గురుప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని జగరాజుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు సీనియర్ బాలికల బాల్బ్యాడ్మిటన్లో రన్నర్స్, సీనియర్ బాలుర చెస్‌లో రన్నర్స్, సీనియర్ బాలుర బ్యాడ్మిటన్లో రన్నర్స్‌గా నిలిచి పతకాలు సాధించినట్లు పీఈటీ అజీంభాష, హెచ్ఎం రాజేష్ తెలిపారు.