క్రోమ్ ఆప్స్...సోషల్ ట్రిక్స్
మనం వాడే వెబ్ బ్రౌజర్ ను బట్టి మన మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రపంచం ఇది... ఎందుకంటే.. దాన్ని బట్టే మనం ఎంత సౌకర్యవంతంగా బతకగలమో తెలిసిపోతుంది కాబట్టి. అవకాశాలున్నప్పుడు వాటిని వాడుకొనే నేర్పు ఎంతుందో అర్థమవుతుంది కాబట్టి! మరి ఇటువంటి సమయంలో అందిపుచ్చుకొనే ఉత్సాహం ఉండాలి కానీ.. వెబ్ విహారానికి ఎన్నోసరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లను వాడుకొంటూ చేసే వెబ్ బ్రౌజింగే అద్భుతమైన ఫీలింగ్‌ను అందిస్తుంది. సౌకర్యాలను వాడుకోవడం మనల్ని ప్రత్యేకమైన వాళ్లమనే గుర్తింపును తెస్తుంది. టెక్శావీలనే పేరును తెచ్చిపెడుతుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఎక్స్‌టెన్షన్‌లుగా అందుబాటులో ఉన్న అలాంటి ఫీచర్లు ఇవి!
ఇన్‌స్టాగ్రమ్ ఫర్ క్రోమ్: ఫాస్ట్, బ్యూటీఫుల్ అండ్ ఫన్... ఇది ఇన్‌స్టాగ్రమ్ ట్యాగ్‌లైన్. మరి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ను కేవలం స్మార్ట్‌ఫోన్‌కు మాత్రమే కాకుండా మీ పీసీ ద్వారా పంచుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ క్రోమ్ఎక్స్టెన్షన్. ఇన్‌స్టాగ్రమ్‌లో ఫ్రెండ్స్ పోస్టు చేసే ఫోటోలను బ్రౌజ్ చేయడానికి, లైక్, కామెంట్లు పెట్టడానికి ఈ ఎక్స్టెన్షన్ ద్వారా అవకాశం ఉంటుంది.
లాస్ట్‌పాస్: తికమక పెట్టే గ్రామర్‌ను ఉపయోగించి ఎంత స్ట్రాంగ్పాస్వర్డ్ తయారు చేసుకొంటే మీ సోషల్నెట్వర్కింగ్ సైట్ అకౌంట్స్ అంత సేఫ్‌గా ఉన్నట్టని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనం ఇప్పటికీ మొబైల్ నంబర్‌నో, ఇంట్లో వాళ్ల పేర్లనో సోషల్సైట్ల పాస్‌వర్డ్స్‌గా పెట్టుకొంటాం. అంతకు మించి ఆలోచించి మనకోసం అంత ఈజీగా బ్రేక్ కావడానికి అవకాశం లేని పాస్‌వర్డ్స్‌ను తయారు చేసి అందిస్తుంది ఈ ఎక్స్టెన్షన్.
టంబ్లర్ కోసం ‘పోస్ట్ టు టంబ్లర్’: మీకు బ్లాగింగ్సైట్ టంబ్లర్లో అకౌంట్ ఉందా? అక్కడ తరచూ మీరు ఫీచర్స్ పోస్టు చేస్తూ ఉంటారా.. అలాంటి బ్లాగర్లకు అవసరం ఈ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే... ఏదైనా వెబ్పేజ్లోని కంటెంట్‌ను ఒకే క్లిక్‌తో టంబల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎవర్‌నోట్ వెబ్ క్లిప్పర్: ‘ఎవర్‌నోట్’ అప్లికేషన్‌తో ఉండే సదుపాయాలు ఏమిటో ఐఫోన్ ను వాడే వారికి బాగా అనుభవం. నిజంగా అది ఒక అద్భుతమైన అప్లికేషన్ అంటూ తేల్చేస్తారు వాళ్లు. మరి అలాంటి యాప్‌ను పీసీ ద్వారా వాడటానికి అవకాశం ఇస్తుంది ఎవర్‌నోట్ వెబ్ క్లిప్పర్ ఎక్స్టెన్షన్. వెబ్ బ్రౌజింగ్సమయంలో టెక్ట్స్, లింక్, ఇమేజ్‌లను ఎవర్‌నోట్ అకౌంట్లోకి సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డాటాను ఎప్పుడైనా, ఎక్కడ నుంచినైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
యాడ్‌బ్లాక్ ప్లస్: సిస్టమ్ వైరస్ బారినపడ్డప్పుడు, మాల్వేర్ అటాక్ అయినప్పుడు చాలా ఇబ్బందులే ఉంటాయి. వెబ్ బ్రౌజింగ్ విషయంలో అవాంతరాలను కల్పిస్తూ అనేక యాడ్ పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మౌస్తో క్లిక్ మనిపించినప్పుడల్లా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతూ చిరాకు పెడుతుంటుంది. మరి అలాంటి సందర్భాల్లో వాటిని బ్లాక్ చేయడానికి అవకాశం ఇస్తుంది ఈ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ విసిగించే సైట్ల యూఆర్ఎల్ను సేవ్ చేశాం అంటే... వాటి తలనొప్పి ఇక ఉండదు. శాశ్వతంగా బ్లాక్ అయిపోతాయి.
బఫర్: సోషల్నెట్వర్కింగ్ సైట్లలో పోస్టులను షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్స్‌టెన్షన్‌తో. పోస్టును అంతా సెట్ చేసి అది ఫలానా టైమ్‌లో పబ్లిష్ అయ్యే విధంగా షెడ్యూల్ చేయవచ్చు దీని సాయంతో. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన క్రోబ్ బ్రౌజర్ నుంచి ట్విటర్, ఫేస్బుక్ ఇతర సైట్ల ను ఆపరేట్ చేసేటప్పుడు అలా షెడ్యూల్ చేసుకొనే ఆప్షన్ వస్తుంది.
అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్: ఫేస్బుక్లో మన స్నేహితులకు సంబంధించిన అప్డేట్స్ నోటిఫికేషన్స్గా వస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా మనల్ని అన్‌ఫ్రెండ్ చేస్తే మాత్రం అప్డేట్ ఉండదు. ఎందుకో ఫేస్బుక్ నిర్వాహకులు ఆన్ఫ్రెండ్ నోటిఫికేషన్స్గానీ అందుకు సంబంధించిన అప్డేట్స్గానీ పెట్టలేదు. అయితే ఈ లోటును తీరుస్తుంది అన్ఫ్రెండ్నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే ఫ్రెండ్స్ జాబితా నుంచి ఎవరు జారిపోతున్నారు తెలుసుకోవచ్చు!
హోవర్ జూమ్..
కొన్ని వెబ్సైట్లలో ఏదైనా ప్రోడక్ట్ కు సంబంధించిన ఫోటోలపై మౌస్ పాయింటర్‌ను పెడితే ఆ ఇమేజ్ జూమ్‌లో కనిపిస్తుంది. రెజల్యూషన్ బాగా ఉంటే ఆ ఫోటోలను హోవర్జూమ్ ద్వారా తీక్షణంగా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి అన్ని సైట్లలోనూ అలాంటి అనుభవం కావాలంటే హోవర్జూమ్ను ఇన్స్టాల్ చేసుకోవడమే. ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే వివిధ సోషల్నెట్వర్కింగ్ సైట్లలోని ఫోటోలు పాయింట్‌ను పెట్టగానే జూమ్‌లో కనిపిస్తాయి.