బెల్ట్‌షాప్ నిర్వాహకులపై కేసు నమోదు
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో బెల్ట్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన చుంచనకోట నర్సాగౌడ్, కీసర అంజాగౌడ్లు వారి హోటళ్లలో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆయా హోటళ్లలో మద్యం బాటిళ్లు లభించగా, వాటిని స్వాధీనం చేసుకుని హోటళ్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.