కత్తులతో బెదిరించి... రూ.26 లక్షలు ఎత్తుకెళ్లారు
నెల్లూరు(తడ): ఓ వ్యాపారిని కత్తులతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
కారులో తడకు వెళుత్ను మణి అనే సిగిరెట్ల వ్యాపారిని మండలంలోని చేని గుంట వద్ద అడ్డగించారు. మూడు బైకులపై వచ్చిన దుండగులు వ్యాపారిని కత్తులతో బెదిరించి రూ. 26 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.