'తెలంగాణ నుంచి పరిశ్రమలు వెళ్లవు'
న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఐఐ సదస్సులో టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్, మ్యానుఫాక్చరింగ్ సర్వీస్ రంగాల్లో అధిక పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి పరిశ్రమలు బయటకు వెళ్లిపోవని సీఐఐ హైదరాబాద్ ఛైర్మన్ సురేష్ అన్నారు. విద్యుత్ సమస్యను తీరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన రాయితీలు, అనువైన పరిస్థితులు కల్పించాలని ఆయన సూచించారు.