విద్య, వైద్య హబ్‌గా చిన్నతిరుపతి
సాక్షి, ఏలూరు : విద్య, వైద్య రంగాలలో ద్వారకాతిరుమల (చిన్నతిరుపతిని)ను అభివృద్ధి చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏలూరులో ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ భూములు అందుబాటులో ఉన్న చిన్న తిరుమలలో విద్యా, వైద్య సంస్థలు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లాకు చెంది న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు ఆదేశించనట్టు చెప్పా రు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు చూ పిన ఆదరణను మర్చిపోకూడదని, రాష్ట్ర మంత్రులందరూ తొలి ప్రాధాన్యం ‘పశ్చిమ’కు, తర్వాత అనంతపురం జిల్లాకు ఇవ్వాలని చంద్రబాబు సూచించినట్టు మంత్రి కామినేని తెలిపారు.
నగరం బాధితులకు మెరుగైన వైద్యం
తూర్పుగోదావరి జిల్లా నగరం ఘటన బాధాకరమని, గ్యాస్ పైప్‌లైన్‌లో పొరపాట్లే ఇందుకు కారణమని మంత్రి అన్నారు. 90 శాతం శరీరం కాలిన వారు బతికే అవకాశం లేదని, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తనకు ఏలూరుతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చే సి మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే గ్యాస్‌లైన్ విస్పోటనం జరిగిందని ఎంపీ మాగంటి బాబు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, గన్ని వీరాం జనేయులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ వి.సత్యనారాయణ, ఇన్చార్జి డీఎంహెచ్‌వో శంకర్రావు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.
8 లైన్ల జాతీయ రహదారి
చెన్నై నుంచి కోల్‌కతా వరకు జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని, దీనిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం వెలువడుతుందన్నారు. పీజీ వైద్య ప్రవేశాలపై 3, 4 తేదీల్లో విధాన రూపకల్పన చేస్తామని తెలిపారు. రాష్ర్టంలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 1.15 లక్షల హెక్టార్లలో పం టలు వేశారని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఓ ఈఆర్ నిబంధనల వల్ల నష్టపోతున్నామని, వ్యాట్ ఎత్తివేయాలని, ఎ గుమతి సుంకం విధించాలని రైతులు కోరారు. కేంద్ర మంత్రులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.