రాములు సేవలు చిరస్మరణీయం
కోహీర్: వీఆర్వోగా రాములు మండల ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. కోహీర్ పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశంలో ఆయనను శాలువాలు పూలమాలలతో సన్మానం చేశారు. తహశీల్దార్ బి.గీత మాట్లాడుతూ రాములు అకింతభావంతో పనిచేసి ఇతర వీఆర్వోలకు ఆదర్శవంతంగా నిలిచారని పేర్కొన్నారు. ఎంపీపీ జంపాల అనిత మాట్లాడుతూ విధుల విషయంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు.
అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కోహీర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాములు ఆయన పూర్తి కాలం మండల ప్రజలకు సేవలు అందించి ఇక్కడే పదవి విరమణ పొందడం అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు ఎస్కే జావేద్, కోఆప్షన్ సభ్యులు అశ్రఫ్, మాజీ జెడ్పీటీసీలు అరవింద్‌రెడ్డి, నర్సింహులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, కోహీర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంశీర్ అలీ, సర్పంచ్‌లు అడివి రెడ్డి, రాందాస్, అంజయ్య, ఎంపీటీసీలు రాజు, సురేందర్, సీనియర్ నాయకులు బస్వరాజ్ పాటిల్, గోవర్ధన్‌రెడ్డి, సాయిలు, సురేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, రెవెన్యూ సంఘాల నాయకులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.