చంద్రబాబు వైఖరి దారుణం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పట్ల పగబట్టినట్లు వ్యహరిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అవిపూర్తి కావాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని చెప్పారు. అయినా ఉద్యోగులు ఇక్కడకు రావాల్సిందేనని సిఎం అనడం దారుణమని విమర్శించారు.
చంద్రబాబు వైఖరి శాడిజాన్ని తలపిస్తోందని ఎంఎ గఫూర్ అన్నారు. తన కింద పనిచేస్తున్నారని, తాను ఏం చెప్పినా ఉద్యోగులు చేయాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. కనీస వసతులు లేని చోట ఉద్యోగులు పనిచేయాలనడం దారుణమని అన్నారు.