సీఐటీయూ ఆందోళన
అనంతపురం: పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను తొలగించటంతో సీఐటీయూ కార్మికులు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డరుకు విరుద్ధంగా ఏజెన్సీలను తొలగించటం అన్యాయమని వారు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులకు ఏజెన్సీలను కట్టబెడుతున్నారని సీఐటీయూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(కనగానపల్లె)