టొరొంటోలో ‘తెలంగాణ పోరు’ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) కెనడా ఆధ్వర్యంలో టొరొంటో నగరంలో నిర్వహించిన తెలంగాణ నైట్ నాలుగో వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో ‘తెలంగాణ పోరు ద్విశతి’ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు టీడీఎఫ్ నిర్వాహ కుడు ఎం.సృజన్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్లోని పింగళి మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ రచించిన ఈ పుస్తకాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
రెండు భాగాలుగా ఉన్న ఈ కవితా సంపుటిలో మొదటి భాగంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, రెండో భాగంలో రచయిత పాటల్లో తెలంగాణ లొల్లి అంశాలున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మిమిక్రీ కళాకారుడు లోహిత్, సహ నిర్వాహకులు భూపతి కృష్ణమూర్తి, కేశవరావ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.